ETV Bharat / state

అవనిగడ్డలో 3 రోజులు పూర్తి లాక్​డౌన్ - ఏపీ తాజా వార్తలు

కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య తీవ్రం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి కర్ప్యూ అమలవుతోండగా.. ఆ వేళల్ని పెంచింది. బుధవారం నుంచి కర్ప్యూ తాజా ఆంక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వాలని సీఎం ఆదేశించారు. అయితే అవనిగడ్డలో మాత్రం మూడు రోజుల పాటు పూర్తి లాక్​డౌన్ విధించనున్నారు.

lockdown
lockdown
author img

By

Published : May 4, 2021, 7:20 AM IST

కరోనా వ్యాప్తి నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ప్యూ అమలవుతోండగా.. ఆ వేళల్ని పెంచింది. బుధవారం నుంచి కర్ప్యూ తాజా ఆంక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. 6,7,8 తేదీలు మూడు రోజుల పాటు పూర్తి లాక్​డౌన్ విధిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ కమిటీ తెలిపింది. లాక్​డౌన్ సమయంలో పాల షాపులు మాత్రమే ఉదయం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు తెరవాలని, మిగతా అన్ని షాపులు మూసివేయాలని అవనిగడ్డ తహసిల్దార్ బి. శ్రీనునాయక్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్​స్పెక్టర్​ బీమేశ్వర రవికుమార్, ఎస్సై సందీప్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఇవాళ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.