సీపీఎస్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేయకుండా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్ని రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. కమిటీలతో కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని.. 11వ పీఆర్సీ అమలు, నాలుగు నెలల డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు.. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను అమలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: