APNGO Election Nomination: ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ విజయవాడ శాఖ ఎన్నికల నామినేషన్ల పర్వం కోలాహలంగా జరిగింది. అలంకార్ సెంటర్ నుండి ఎన్జీఓ నాయకులు ఊరేగింపుగా తరలివచ్చారు. అధ్యక్షునిగా శ్రీరామ్, కార్యదర్శిగా సంపత్ కుమార్ కోశాధికారిగా నజీర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్జీఓ పశ్చిమ కృష్ణ కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపైన కార్యచరణకు సన్నద్దమవుతునట్లు తెలిపారు.
ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, ఇంక్రిమెంట్లు అలాగే ఉన్నాయని సీపీఎస్‌పై ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. జీపీఎఫ్ పట్ల ఉద్యోగులకు ఎన్నో అనుమానాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని సమస్యలపై ఆందోళన ఉద్ధృతం చేస్తామని విద్యాసాగర్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: