ETV Bharat / state

77 గిరిజన మండలాల్లో 'వైఎస్​ఆర్​ పోషణ ప్లస్'..విధి విధానాలు విడుదల - ఏపీ ప్రభుత్వం కొత్త పథకం వార్తలు

గిరిజనులకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు వైకాపా సర్కార్ మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. వైఎస్​ఆర్​ పోషణ ప్లస్​గా దీనికి నామకరణం చేసింది. ఈ పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ysr sampurna poshana plus
ysr sampurna poshana plus
author img

By

Published : Jun 27, 2020, 6:18 PM IST

Updated : Jun 27, 2020, 7:00 PM IST

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోని మహిళలు, శిశువులకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ఈ పథకం అమలుకు విధి విధానాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిగిలిన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, 6 నుంచి 36 నెలలలోపు శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు సంపూర్ణ పోషణ పథకం అమలుకు ఉత్తర్వులు విడుదల చేసింది.

257 ఐసీడీఎస్ పథకాల ద్వారా 13 జిల్లాల్లోనూ సంపూర్ణ పోషణ పథకం అమలు కానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్​వాడీ కేంద్రాల ద్వారా అమలుకు కార్యాచరణ చేపట్టింది. అంగన్​వాడీ కేంద్రాల్లో అందించే ఆహారానికి ఒక్కో లబ్దిదారుకు నెలకు 600 రూపాయలు చొప్పున, అలాగే గర్భిణులు, బాలింతలకు ఇంటికి తీసుకెళ్లే రేషన్ కోసం నెలకు 500 రూపాయలు, శిశువులకు అందించే పౌష్టికాహారానికి ఒక్కొక్కరికి నెలకు 533 రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి

నంద్యాలలో గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం చర్యలు

Last Updated : Jun 27, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.