ETV Bharat / state

నిత్యావసరాల కొరత రాకుండా కంట్రోల్​ రూం ఏర్పాటు - covid special officers in ap news

రాష్ట్రంలో లాక్​డౌన్​ నేపథ్యంలో నిత్యావసరాల కొరత రాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర స్థాయి కంట్రోల్​ రూం ఏర్పాటు చేసింది. అవసరాలకు అనుగుణంగా రైతు బజార్లు అందుబాటులో తెచ్చినట్లు కొవిడ్​ ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న తెలిపారు. వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

'నిత్యావసరాల కొరత రాకుండా కంట్రోల్​ రూం ఏర్పాటు'

author img

By

Published : Mar 30, 2020, 7:57 PM IST

ప్రభుత్వ చర్యలు వివరిస్తున్న కొవిడ్​ ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న

రాష్ట్రంలో లాక్​డౌన్ అమలవుతున్న పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేసింది. ఉత్పత్తి, వస్తు సరఫరా సంబంధిత ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకు.. సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్​తో కూడిన పాస్​లు జారీ చేయనుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా 350 అదనపు రైతు బజార్లు, 131 మొబైల్​ రైతు బజార్లు అందుబాటులో ఉన్నట్లు కొవిడ్​ ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న తెలిపారు. వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

టోల్​ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు

ప్రజలు సమస్యలు తెలిపేందుకు 1902 టోల్​ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశామని.. ఇది 24 గంటలూ పనిచేస్తుందని ప్రద్యుమ్న తెలిపారు. రోజుకు 20 వేల టన్నుల కూరగాయలు రైతు బజార్ల ద్వారా సరఫరా జరుగుతుండగా.. వాటిలో 20 శాతం డోర్ డెలివరీ ద్వారా ఇస్తున్నామన్నారు.

ఇదీ చూడండి:

'ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్​తో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.