మందడంలో రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరంలో కూర్చుని అమరావతి ద్రోహులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు అమరావతి అంగుళం కూడా కదలదంటూ హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడేమయ్యారంటూ రైతన్నలు ప్రశ్నించారు. ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు.. నేతలకు తమ తరఫు నుంచి బహుమతిగా గాజులు, చీర, పూలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి నాయకుల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి....