ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన మాజీ రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను సినీనటుడు మోహన్‌బాబు పరామర్శించారు(Mohan Babu consulted Yarlagadda Lakshmi Prasad). కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలోని యార్లగడ్డ స్వగృహంలో లక్ష్మీప్రసాద్‌ను కలిశారు. లక్ష్మీప్రసాద్ మాతృమూర్తి రంగనాయకమ్మ విగ్రహానికి నివాళులర్పించారు.
లక్ష్మీప్రసాద్ కుటుంబ సభ్యులను పేరుపేరునా పరామర్శించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తనకు అత్యంత ఆప్తుడని.. యాభై ఏళ్ళ అనుబంధం ఉందని మోహన్ బాబు తెలిపారు. లక్ష్మీప్రసాద్ తల్లిని కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. లక్ష్మీప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు తెలిపారు. మాతృమూర్తి రంగనాయకమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
జాషువా సాహిత్యం మరింత వ్యాపించాలి: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్