104 కాల్ సెంటర్ ద్వారా... 10 లక్షల 16వేల 760 టెలీ కన్సల్టేషన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో గన్నవరం హెచ్‌సీఎల్, మంగళగిరిలోని ఏపీఐఐసీల్లో 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్లో 27 మంది వైద్యులు... మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారని వైద్య అధికారులు అన్నారు. 104 కాల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 10 లక్షల కాల్స్ రాగా... 15 వేల 4 కాల్స్‌కు సంబంధించిన సమస్యలు పెండింగ్ ఉన్నాయని అన్నారు.
హోమ్ ఐసోలేషన్ ద్వారా.. 7 లక్షల 20 వేల 79... హోమ్ క్వారంటైన్‌కు సంబంధించి 1 లక్ష 18 వేల 284... పిల్లల ఆరోగ్య సమస్యలకు సంబంధించి 1,824 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఫీవర్ సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించామన్నారు. టెస్ట్ రిజల్స్ కోసం.. 76 వేల 82 మంది కాల్స్, వ్యాక్సినేషన్ కోసం 31 వేల 290,కోవిడ్ టెస్ట్‌ల కోసం లక్ష 8 వేల 317, సమాచారం కోసం 94 వేల 803 , ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం 94 వేల 803, మంది ఫోన్ చేసినట్లు వైద్య అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:
Rains in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు విస్తారంగా...!