Out of date chikkilu: విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహార చిక్కీలు కాలం చెల్లిపోవటంతో... కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాలవ గట్టు వద్ద గుట్టలు గుట్టలుగా పడేశారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వం చిక్కీలు అందిస్తున్నామనడం ఒట్టి ప్రచారమే అన్నట్టుగా ఇక్కడి దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఇదే తరహాలో గతేడాది చిక్కీలు పడేసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు.. అధికారులకు ఫిర్యాదు చేయటంతో విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విద్యార్థులకు పంపిణీ చేయకపోటంతోనే పౌష్టికాహారం కాలం చెల్లిపోయి వృథా అవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి