ETV Bharat / state

YSRCP ignored TDP started development works: వైసీపీ ప్రభుత్వ నీచపు చర్య..! టీడీపీ ప్రారంభించిన పనులన్నీ పాతాళానికి తొక్కుతూ.. - గుంటూరులో ట్రాఫిక్‌ సమస్య

YSRCP ignored TDP started development works: ఎన్నో హామీలను.. ఎంతో గొప్పగా నీతివాక్యాలను పలుకుతూ అధికారం.. చేజిక్కించున్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టేసింది. ముఖ్యంగా అభివృద్ధి పథకాలేమైనా.. గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందనే విషయం తెలిస్తే చాలు... దాన్ని వైసీపీ ప్రభుత్వం పాతళంలోకి తొక్కి పెడుతోంది. ఆ వివక్ష ఏ స్థాయిలో ఉందో ఈ కథనం వివరిస్తోంది.

YSRCP_ignored_TDP_started_development_works

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 12:17 PM IST

YSRCP ignored TDP started development works: వైసీపీ ప్రభుత్వ నీచపు చర్య.. టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ పాతాళానికి తొక్కుతూ..

YSRCP ignored TDP started development works: అధికారం అంటే ఆజమాయిషీ చేయడం కాదు. ప్రజల పట్ల మమకారం చూపడం. ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగడుగులు ముందుకు వేయడం.. ఇవి సీఎం జగన్‌ ప్రతిసమావేశంలోనూ, సభల్లో వల్లె వేసే మాటలు. కానీ ఆచరణ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులైతే ఇక అంతే సంగతులు. పైసా నిధులు కూడా విడుదల కావు. వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో ఇప్పటికే పలు ప్రాజెక్టులు అటకెక్కగా.. కొన్ని అసంపూర్తిగా నిలిచిపోయాయి.

'ఎక్కడ కూడా లంచాలకు తావు లేకుండా.. ఎక్కడా వివక్షకు చోటివ్వకుండా. ఎటువంటి మతం, కులం, ప్రాంతం చూడకుండా.. చివరకి రాజకీయ పార్టీ అన్న ప్రస్థావన కూడా చూడకుండా. మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు. అర్హత ఉంటే కచ్చితంగా అందించాలి. ఏ ఒక్కరూ మిస్​ కాకుడదు అని తపన తాపత్రయంతో.. అడుగులు వేస్తున్న పాలనే.. నవరత్నాల పాలన.' అని ఆగస్టు 24, 2023లో మన ముఖ్యమంత్రి జగన్​ చెబుతున్న నీతి వాక్యాలు ఇవి.

సంక్షేమ, అభివృద్ధి పనుల్లో ఎంతో విశాల హృదయంతో వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి జగన్‌.. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులంటే చాలు... భగ్గుమంటున్నారు. అవి ప్రజాప్రయోగకరమైనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకాలైనా.. అందరికీ ఉపయోగపడే రహదారులైనా.. గత ప్రభుత్వం ప్రారంభించినవైతే చాలు నిధులివ్వకుండా నిలిచిపోయేలా చేస్తున్నారు. పుర, నగరపాలక సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కోసం టీడీపీ హయాంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులను అటకెక్కించారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నెల్లూరు తదితర నగరాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి అద్దం పడుతున్నాయి.

Achenna on Projects: 'జలవనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన రాయలసీమ ద్రోహి.. జగన్‌ రెడ్డి'

గుంటూరులో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి టీడీపీ హయాంలో నాలుగు దశల్లో దాదాపు 14 కిలోమీటర్ల మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని జగన్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఒకటి, రెండు, నాలుగు దశల పనులు పూర్తయ్యాయి. మూడో దశలోని స్వర్ణభారతి నగర్‌ నుంచి పెదపలకలూరు వరకు 4.25 కిలోమీటర్లు రహదారి నిర్మాణ పనులపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

ఈ రోడ్డు పూర్తయితే సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట నుంచి వచ్చే వాహనాలు గుంటూరు నగరంలోకి రాకుండానే విజయవాడ, రాజధాని అమరావతి ప్రాంతానికి నేరుగా వెళ్లే వీలుంటుంది. మచిలీపట్నంలో 16.76 కోట్ల రూపాయలతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులకు టీడీపీ హయాంలో 2018 మేలో శంకుస్థాపన చేశారు. దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాక వచ్చిన కొత్త ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

'వైసీపీ అభివృద్ధి పట్టించుకోకుండా.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది'

మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం కూడా పూర్తి కాలేదు. విజయవాడ-బందరు రోడ్డుపై రద్దీ నియంత్రణలో భాగంగా మహానాడు రోడ్డు నుంచి తాడిగడప వరకు చేపట్టిన 80 అడుగుల వెడల్పు రహదారి నిర్మాణం మధ్యలోనే నిలిచింది. మహానాడు రోడ్డు నుంచి ఆటోనగర్‌ వరకు నిర్మాణం పూర్తయింది. తాడిగడప వరకు భూసేకరణ యత్నాలు కొలిక్కి వస్తున్న దశలో ప్రభుత్వం మారింది. రహదారి నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్య తీరే అవకాశం ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

నెల్లూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి 512.76 కోట్ల రూపాయల విలువైన హడ్కో సాయంతో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పూర్తిపై జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సంగం ఆనకట్ట నుంచి 724 కిలోమీటర్ల పొడవు పైపులైన్ల నిర్మాణం పూర్తయినా దశాబ్దాల నాటి పాత పైప్‌లైన్‌ ద్వారానే ప్రస్తుతం ఇళ్లకు నీళ్లు సరఫరా చేస్తుండడం విచిత్రం. గత ప్రభుత్వ హయాంలో పనులు పూర్తవడంతో ఎక్కడ టీడీపీకి పేరొస్తుందోనన్న కారణంతోనే కొత్త పైప్‌లైన్‌ వినియోగించకుండా వదిలేశారు.

రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు: టీజీ వెంకటేష్

విశాఖలోని హనుమంతువాక నుంచి వేపగుంట మధ్య శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ కారిడార్‌లో పాత గోశాల-పాత అడివివరం మధ్య దాదాపు 2 కిలో మీటర్లు రహదారి నిర్మాణం పూర్తి చేస్తామన్న జగన్‌ ప్రభుత్వ హామీ ఉత్తి మాటగానే మిగిలిపోయింది. రోడ్డు పక్కన ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేయించి, పరిహారం చెల్లించే విషయంలో ప్రతి‌ష్టంభన కొనసాగుతోంది.

ఏడాదిగా అభివృద్ధి పనులు చేయలేకపోయాం: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.