ETV Bharat / state

అమరావతి అభివృద్ధి చేయలేని జగన్​ ఉత్తరాంధ్రకు ఏం చేస్తాడు ?: రాజధాని రైతులు - Amaravati News

YCP Government Destroyed Amaravati : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ విచ్ఛిన్నం చేయడం తప్ప.. జగన్‌కు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి లేదని రాజధాని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ శాఖల కోసం భవనాల కేటాయింపు జీవోపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని విశాఖకు తరలించాలనే ఉద్దేశంతోనే.. జగన్‌ చీకటి జీవో తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోపై విపక్షాలు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.

YCP_Government_Destroyed_Amaravati
YCP_Government_Destroyed_Amaravati
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 9:28 PM IST

అమరావతి అభివృద్ధి చేయలేని జగన్​ ఉత్తరాంధ్రకు ఏం చేస్తాడు ?: రాజధాని రైతులు

YCP Government Destroyed Amaravati : ప్రభుత్వ శాఖల కోసం విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోర్టు ధిక్కరణేనన్నారు. నాలుగున్నరేళ్లలో అమరావతి అభివృద్ధి చేయలేని జగన్.. ఉత్తరాంధ్రకు ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై విపక్షాలు సైతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వ కార్యాలయాలను దొడ్డిదారిన తరలించేందుకు వ్యవస్థల్ని బెదిరించి.. జగన్ జీవోలు ఇప్పిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.

విశాఖకు కార్యాలయాల తరలింపు కోర్టు ధిక్కారమే : ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతుల ఆగ్రహం

Nara Lokesh Criticized Jagan : ఐటీ అభివృద్ధి కోసం టీడీపీ హయాంలో కట్టిన మిలీనియం టవర్స్‌ని ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్ల ఆదాయం తెచ్చే.. కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నారని ధ్వజమెత్తారు. రుషికొండ, కైలాసగిరిని నాశనం చేసి.. విశాఖను విధ్వంసం చేసి.. ఆఖరికీ ఆ శిథిలాలపై కూర్చుని ఏ చేస్తావు జగన్‌ అంటూ లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

రాజధాని అమరావతిపై మరో కుట్ర.. ప్లాట్లను రద్దు చేసుకోవాలంటూ సీఆర్డీఏ నోటీసులు

Millennium Towers Destroyed in Visakhapatnam : అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా.. దీన్నే రాజధానిగా కొనసాగిస్తానని జగన్‌ గత ఎన్నికల్లో ప్రజలను వంచించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇప్పుడేమో ఉత్తరాంధ్రకు మకాం మారుస్తా.. అక్కడి ప్రజల జీవితాలు మార్చేస్తానని.. మరో మోసానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. కోర్టుల ఆదేశాలు ధిక్కరిస్తూ.. మరోసారి తన నియంతృత్వ పోకడలను చాటుకున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. జగన్‌ ఎన్ని మాయమాటలు చెప్పినా.. ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

"సీఎం జగన్‌కు నిజంగా విశాఖపై ప్రేముంటే.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపాలని.. సీపీఎం డిమాండ్‌ చేసింది. ప్రజల దృష్టిని మరల్చేందుకే.. జగన్‌ జీవో ఇచ్చారని ఆ పార్టీ నేత బాబూరావు అన్నారు." - సి.హెచ్‌. బాబూరావు, సీపీఎం నేత

Capital Shift to Visakhapatnam : వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో అత్యంత విలువైన భూముల్ని అవకాశం ఉన్న చోటల్లా అధికార పార్టీ ముఖ్యనేతలు, వారి బినామీలు స్వాహా చేసేశారు. మింగేయడానికి అవకాశం లేని భూముల్ని ప్రభుత్వం తనఖా పెట్టి సుమారుగా రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చేసింది. ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో ఇప్పటికే హెచ్ఎస్​బీసీ వంటి ఐటీ సంస్థలు విశాఖను వదిలి వెళ్లి పోయాయి. మరికొన్ని సంస్థల్ని ప్రభుత్వమే వెళ్ల గొట్టింది.

తాత్కాలిక వసతి ముసుగులో.. మరో డ్రామాకి తెర లేపిన వైసీపీ సర్కార్

ఇంకేం మిగిలిందని.. ముఖ్యమంత్రి, మంత్రులు విశాఖకు వెళ్లాలనుకుంటున్నారు? విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మించిన మిలీనియం టవర్స్​లో చాలా భాగాన్ని.. రాజధానిని అక్కడికి తరలించే దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇన్నేళ్లూగా అక్కడ ఖాళీగా పెట్టింది. దానిని ఇప్పుడు అమల్లో పెడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.