ETV Bharat / state

'ప్రేమించాడు... పెళ్లి చేసుకున్నాడు... మతం మారమని వేధిస్తున్నాడు' - గుంటూరు క్రైం

యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. మతాలు వేరైనా, పెద్దలు ఒప్పుకోకున్నా వారిని ఎదురించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ నుంచి ఇస్లాంలోకి మారిపోవాలన్న భర్త, అత్తింటి వారి వేధింపులతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయింది. చివరకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

woman complaint to her husband family members in guntur
అత్తింటి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన మహిళ
author img

By

Published : Mar 17, 2021, 5:44 PM IST

Updated : Mar 17, 2021, 7:44 PM IST

గుంటూరుకు చెందిన దివ్య మూడేళ్ల క్రితం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో సంగీతం కోర్సు పూర్తి చేసింది. ఆ సమయంలో అదే కళాశాలలో చదువుతున్న అహమ్మద్ తౌసీఫ్ అలియాస్ తారక్ అనే వ్యక్తి దివ్యకు పరిచమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదురించి తౌసీఫ్​ను వివాహం చేసుకుంది.

అనంతరం దివ్య తౌసీఫ్​తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. అక్కడ వారం రోజులు ఉన్న తర్వాత తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని తౌసీఫ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వెళ్లాడు. కొద్దిరోజుల తర్వాత దివ్యనూ ఎమ్మిగనూరు తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లిన అనంతరం దివ్యను ఇస్లాం మతంలోకి మారాలంటూ కుటుంబంసభ్యులతో కలిసి వేధింపులకు గురిచేశాడు.

ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి.. సంతోషంగా చూసుకుంటాడు అనుకుంటే, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనను వేధింపులకు గురి చేసిన తౌసీఫ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జరిగినట్లు ఇంకా ఎవరికీ జరగవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. హిందూ సంఘాల నేతలు, సినీ నటి కరాటే కళ్యాణి బాధితురాలికి అండగా నిలిచారు.

ఇదీచదవండి. సీఎం ముఖ్యసలహాదారు నీలం సాహ్నికి వేతనం నిర్ధారిస్తూ ఉత్తర్వులు

Last Updated : Mar 17, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.