ETV Bharat / state

శ్రీ ఛారిటబుల్ ట్రస్టుకు వేద సీడ్స్ విరాళం.. అంబులెన్స్ అందజేత - శ్రీ ఛారిటబుల్ ట్రస్టు వార్తలు

గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శ్రీ ఛారిటబుల్ ట్రస్టుకు వేద సీడ్స్ యాజమాన్యం అంబులెన్స్​ వాహనాన్ని విరాళంగా అందజేసింది. ట్రస్టు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహాయం అందిస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మచరణ్ తెలిపారు.

Veda Seeds Company
అంబులెన్స్​ను విరాళంగా అందించిన వేద సీడ్స్ కంపెనీ
author img

By

Published : Jun 12, 2021, 11:50 AM IST

గుంటూరు జిల్లా గురజాలలోని శ్రీ ఛారిటబుల్ ట్రస్టుకు వేద సీడ్స్ యాజమాన్యం అంబులెన్సును విరాళంగా అందజేసింది. వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్, ట్రస్టు ప్రతినిధులు కలిసి ఈ రోజు అంబులెన్స్​ను ప్రారంభించారు. వైద్య అవసరాల కోసం గురజాల నుంచి గుంటూరు రావటానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు అంబులెన్స్​లకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.

ఈ సమస్యకు పరిష్కారంగా శ్రీ ఛారిటబుల్ ట్రస్టు అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. కేవలం నిర్వహణ ఖర్చులతో రోగులను తరలించేందుకు సంస్థ ముందుకొచ్చింది. ట్రస్టు తరపున కొన్నేళ్లుగా పేదలకు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. వారి సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు తమవంతు సహకరం అందిస్తున్నామని వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మచరణ్ తెలిపారు.

ఇదీ చదవండి:

కొండవీడులో దిగుడు బావి గుర్తింపు.. ఇది ఏనాటిదో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.