ETV Bharat / state

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా.. ఊరూరా నిరీక్షణలే! - Covid Effect on AP

కొవిడ్‌ టీకాల పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. టీకాల కోసం పంపిణీ కేంద్రాల చుట్టూ అర్హులు నిత్యం తిరుగుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా, కర్ఫ్యూ అమల్లో ఉన్నా రోడ్లపైకి వస్తున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద సరైన సమాచారమిచ్చే వారు కనిపించడం లేదు. మలి విడత డోసు పొందేందుకు గడువు ముగుస్తున్న వారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆధార్‌, ఫోన్‌నంబరు ఆధారంగా తొలిడోసు వేస్తున్నారు. వీటి ఆధారంగా రెండో డోసు వేయడంపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. కొందరు ఈ సమాచారం అందుకొని కేంద్రాలకు వెళితే, వ్యాక్సిన్‌ లేదనే సమాచారం వస్తోంది. టీకా వేయడంపై తొలి రోజుల్లో ఉన్న శ్రద్ధ ప్రస్తుతం కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో నెలకొన్న గందరగోళాన్ని సరిచేసేందుకు ప్రయత్నించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

టీకాల కోసం..
టీకాల కోసం..
author img

By

Published : May 8, 2021, 6:34 AM IST

టీకాల కోసం గుంటూరు జిల్లాలో రెండు కేంద్రాల వద్ద శుక్రవారం తోపులాట జరిగింది. పోలీసులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వ్యాక్సినేషన్‌పై సరైన విధంగా ప్రచారం చేయనందున క్షేత్రస్థాయి పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. కార్యాచరణ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన కొన్ని జిల్లాల అధికారులు, క్షేత్ర సిబ్బంది తగిన చొరవ చూపడం లేదు. తొలి డోసు ఇప్పుడు వేయబోమని, మలివిడత వారికే వ్యాక్సినేషన్‌ ఉంటుందన్న ప్రభుత్వ స్థాయి నిర్ణయాలను ప్రజలకు చేరువ చేయాల్సి ఉంది.

ప్రచారం అంతంతే..

ఈనెల 15లోగా 12.93 లక్షల మందికి మలివిడత టీకానివ్వాలి. వీరిలో ఇప్పటివరకు సుమారు 5లక్షల మందికి టీకా వేశారు. మిగిలిన వారిలో రెండు రకాల టీకా పొందాల్సిన వారు ఉన్నారు. తొలి, మలివిడత వ్యాక్సినేషన్‌ మధ్య కాలవ్యవధిని రెండు కంపెనీలు నిర్దేశించాయి. ఈ వ్యవధి చాలామందికి తెలియడం లేదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒకరు కొవాగ్జిన్‌ రెండో విడత పొందేందుకు గడువు ముగుస్తున్నా ఇంతవరకు లభించడం లేదు. ఇలాంటి పరిస్థితులే ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు, ఏప్రిల్‌ తొలివారంలో కొన్నిచోట్ల కొవాగ్జిన్‌నే వేశారు.

వైద్య సిబ్బంది సూచించిన గడువు ప్రకారం రెండో విడత కోసం వెళ్లినవారికి కొవాగ్జిన్‌ లేదనే సమాధానం వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేయించుకోవాలన్నా దొరకడం లేదని అనంతపురం వాసి ఒకరు వాపోయారు. జిల్లాలకు అందించే కొవాగ్జిన్‌ను ఒక్కోసారి పరిమిత కేంద్రాల్లోనే వేస్తున్నారు. దీనివల్ల రద్దీ పెరుగుతోంది. కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పుడు టీకాల పంపిణీపై మరింత స్పష్టతనివ్వాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్రం నుంచి తాజాగా లక్ష వరకు కొవాగ్జిన్‌ డోసులు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిసింది. దీనిని శనివారంలోగా పంపిణీ చేయనున్నారు. నిరీక్షిస్తున్నవారు లక్షల్లో ఉంటే... వచ్చిన డోసులు మరీ తక్కువగా ఉన్నాయి.

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తొలి విడత కొవాగ్జిన్‌ టీకాను మార్చి 27న పొందారు. రెండో విడత వేయించుకోవడానికి గడువు ముగియడంతో ప్రస్తుతం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొవిన్‌యాప్‌లో పరిశీలించగా శుక్రవారం కొవాగ్జిన్‌ వేస్తున్నట్లు కనిపించింది. వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. టీకా వేయించుకునేందుకు వైద్యులను సంప్రదించగా తమ వద్ద కొవిషీల్డ్‌ మాత్రమే ఉందనే సమాధానం వచ్చింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు వచ్చిన సందేశం ప్రకారం ఏర్పాట్లు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు, నరసరావుపేటలలో తోపులాట

గుంటూరు, నరసరావుపేటలలోని రెండు కేంద్రాల్లో కొవిడ్‌ టీకా వేయించుకోవడానికి గంపెడాశతో వచ్చిన వారికి చివరకు నిరాశే మిగిలింది. మండుటెండల్లో గంటల తరబడి క్యూలో నిల్చున్నా నిష్ఫలమే అయింది. వరుసల్లో తోపులాటల మధ్య కొందరు గాయపడ్డారు. చివరకు పోలీసులు, అధికారులు జోక్యం చేసుకున్నారు. టీకా వేస్తారనే ప్రచారంతో గుంటూరు నగరంలోని మల్లికార్జునపేట, జిల్లాలోని నరసరావుపేట పాలపాడు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు భారీగా వచ్చారు. వ్యాక్సిన్‌ నిల్వలు సరిపడా లేనందున ఉన్నంతవరకే టోకెన్లను ఇచ్చి యంత్రాంగం మిన్నకుంది.

విషయం ముందే తెలియజేస్తే తాము క్యూలో నిల్చోకుండా వెళ్లిపోయేవారమని, గంటల తరబడి నిరీక్షించాక కొందరికే టోకెన్లు ఇవ్వడమేమిటని ప్రజలు మండిపడ్డారు. రెండు కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రారంభ కాకముందే ప్రజలు లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రెండు చోట్ల ఉద్యోగులు అప్రమత్తమై పోలీసులు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. నరసరావుపేటలోని పాలపాడు కేంద్రంలో కొవాగ్జిన్‌ రెండో డోసు అవసరమైన వారికి మాత్రమే టీకా వేస్తారని ప్రకటించినా కొవిషీల్డు రెండో డోసు కోసం, మొదటి డోసు వేయించుకోవాలనుకునేవారు కూడా కేంద్రం వద్దకు రావడంతో రద్దీ పెరిగింది.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో మార్చి 25న ఒకరు కొవిషీల్డ్‌ టీకా పొందారు. రెండో విడత టీకా కోసం వెళ్తే.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరని సూచించారు. దాని ప్రకారం ప్రయత్నిస్తే మొదటి డోసు వివరాలు అప్‌డేట్‌ కాలేదని తేలింది. మొదటి డోస్‌ వేసిన ఆసుపత్రి సిబ్బందిని ఫోన్‌లో సంప్రదించగా... నేరుగా వస్తే టోకన్‌ ఇస్తామన్న సమాధానం వచ్చింది. సరాసరి వెళితే ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలని సిబ్బంది చెప్పారు.

తొలి డోసు పొందిన వారు 53,78,712
రెండో డోసు పొందిన వారు 17,96,691
ఈ నెలాఖరులోగా కొవిషీల్డ్‌ రెండో డోసు పొందాల్సిన వారు 19,68,059
కొవాగ్జిన్‌ రెండో డోసు పొందాల్సిన వారు 4,21,285

ఇదీ చదవండి:

డబుల్ మ్యూటెంట్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది: సీసీఎంబీ మాజీ డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.