గుంటూరు జిల్లా తాడికొండనియోజకవర్గం పిరంగీపురం మద్యం దుకాణాలలో మద్యం కొనుగోలు చేసందుకు మందుబాబులు గొడుగులతో బారులు తీరారు. లాక్ డౌన్ కారణంగా 45 రోజులుగా దుకాణాలు మూసి వేశారు. మొదటి రోజు దుకాణాలు తెరిచే సమయానికి కొనుగోలుదారులు నిబంధనలు పాటించకుండా మందు కోసం ఎగబడ్డారు. దీంతో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని భౌతిక ధురం పాటించాలనే ఉద్దేశంతో మందు కావాలంటే గొడుగును తప్పనిసరి చేశారు. ఈ నిబంధనతో ఇటు భౌతిక దూరం పాటించినట్లు అవుతుంది. అటు ఎండలో మాడిపోకుండా రక్షణగా కూడా పనిచేస్తుంది. దీంతో మందు కోసం వచ్చేవారు కూడా గొడుగుతో షాపుల ముందు బారులు తీరుతున్నారు.
ఇవీ చూడండి...