గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి ఆరుగురు వ్యక్తులతో ఒంగోలు వైపు వస్తున్న ట్రాలీ ఆటో... తిమ్మాపురం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఒకరు మృతిచెందగా... ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన కోనంకి నరసయ్య (80) అక్కడికక్కడే మృతిచెందారు. యడ్లపాడు ఎస్సై రాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండీ... భార్య ఒడిలోనే ప్రాణం వొదిలిన కరోనా బాధితుడు