కేంద్రం తెచ్చిన సీఏఏకు మద్దతుగా గుంటూరులో తిరంగ ర్యాలీ నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ ర్యాలీలో పాల్గొని... అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశ విభజన సమయంలో మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన మేరకే ప్రధాని మోదీ సీఏఏను తీసుకొచ్చారని తెలిపారు. ఈ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పిన ఆయన... దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రజలు అవాస్తవ ప్రచారాలకు భయపడొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు రాజకీయ దురుద్దేశంతోనే దేశాన్ని హింసకు గురి చేసే పరిస్థితికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జనవరి 8న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె: వామపక్షాలు