ETV Bharat / state

జిల్లాలో 714కు చేరిన కరోనా కేసుల సంఖ్య - గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 35 కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసులు 714కు చేరుకుంది.

guntur
జిల్లాలో 714కు చేరిన కరోనా కేసుల సంఖ్య
author img

By

Published : Jun 16, 2020, 7:43 PM IST

లాక్ డౌన్ ఆంక్షలు తొలగిన తరుణంలో జనం స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. తెలిసో తెలియకో పాజిటివ్ వచ్చిన వారిని కలిసి వైరస్ భారిన పడుతున్నారు. దీని వల్ల గుంటూరులో తాజాగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసులు 714కు చేరుకున్నాయి. అత్యధికంగా మంగళగిరిలో 9 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో 7, నర్సరావుపేటలో 7, తాడేపల్లిలో 3, సత్తెనపల్లిలో 2 కేసులు వచ్చాయి. మంగళగిరిలో నమోదైన కేసుల్లో 6 ఏపీఎస్పీ బెటాలియన్​కు చెందిన వారివిగా గుర్తించారు. సత్తెనపల్లిలో వచ్చిన పాజిటివ్ కేసులు ఇటీవల మరణించిన వారి అంత్యక్రియలకు హాజరైన వారివిగా తేల్చారు. అలాగే చెరకుపల్లి, వేమూరు, నంబూరు, నిజాంపట్నం, తెనాలిలోని నాజరుపేట, పొన్నూరు మండలం మన్నవ, నగరం మండలం చినమట్లుపూడిలో 1చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిన్నటి వరకూ పట్టణాలకు మాత్రమే పరిమితమైన కరోనా కేసులు తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వెలుగుచూస్తున్నాయి. తాజా కేసులతో కలిపి గుంటూరు నగరంలో 300 సమీపిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో నర్సరావుపేట 214, తాడేపల్లి 39, మంగళగిరి 33 ఉన్నాయి.

ఇది చదవండి జిల్లాలో ప్రారంభమైన బ్రిడ్జి కోర్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.