గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం(Guntur Municipal Corporation Council meeting)లో మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓ దశలో ఎమ్మెల్యే ముస్తఫా సమావేశం నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
నిబంధనల ప్రకారం సభలో లేని సభ్యుల ప్రతిపాదనలు వాయిదా వేయాలి. కానీ కొందరు సభ్యుల ప్రతిపాదనల్ని ఎమ్మెల్యే హోదాలో తాను ప్రతిపాదిస్తానని ముస్తఫా తెలిపారు. దానికి నిబంధనల అనుమతించవని మేయర్ చెప్పటంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఓ దశలో బయటకు వెళ్లేందుకు ఎమ్మెల్యే సిద్ధం కాగా.. కార్పొరేటర్లు నచ్చజెప్పారు.
ఇదీ చదవండి