గుంటూరులోని తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత - చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నరసరావుపేటలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా నరసరావుపేటలో చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి యువత ద్విచక్రవాహన ర్యాలీ చేయాలని నిర్ణయించింది. అయితే.. ర్యాలీలకు అనుమతి లేదంటూ పార్టీ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు పర్యటన జరిగి తీరుతుందంటూ కార్యకర్తలు నినాదాలు చేయటంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.