ETV Bharat / state

నిత్యావసర సరకుల ధరల పెరుగుదలపై తెదేపా నిరసన - tdp protest at guntur district

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ గుంటూరులో తెదేపా నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు.

నిరసన తెలుపుతున్న తెదేపా నేతలు
నిరసన తెలుపుతున్న తెదేపా నేతలు
author img

By

Published : Sep 12, 2020, 5:07 PM IST

గుంటూరులో తెదేపా నేతలు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మెడలో కూరగాయల దండలు వేసుకుని బి.ఆర్ స్టేడియంలోని రైతు బజార్​లో తిరుగుతూ నిరసన తెలియజేశారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయి... జీవనోపాధి కష్టతరంగా మారిన సమయంలో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచడం దారుణమని గుంటూరు తూర్పు తెదేపా సమన్వయకర్త నసిర్ అహ్మద్ అన్నారు. దళారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి వ్యాపారాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా మొద్దునిద్ర పోతుందన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ప్రారంభోత్సవంతో సరి! అందుబాటులోకి రాని కొవిడ్‌ ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.