రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం పేరిట వైకాపా నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వైకాపా నేతల ఆస్తులు రెండింతలు పెరిగాయని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో రూ.3వేలకు ఫించన్ పెంచుతానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్... కేవలం రూ.250 పెంచి వృద్ధులు, వితంతువులను మోసం చేశారని విమర్శించారు. 80 లక్షల మందికి ఇవ్వాల్సిన అమ్మఒడిని 43లక్షల మందికి కుదించారని ఆక్షేపించారు.
ఇదీచదవండి.