TDP Celebrations at Mangalagiri Party Central Office: స్కిల్ కేసులో అవినీతి ఆరోపణలతో అరెస్టైనా చంద్రబాబుకు.. మధ్యంతర బెయిల్ మంజూరు కావటంపై టీడీపీ నేతలు హర్షం చేస్తున్నారు. అలస్యమైనా ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి కాలు బయటపెట్టిన మరుక్షణం నుంచి సీఎం జగన్ పతనం ప్రారంభమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట సంబరాలు: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో.. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఈ సంబరాలను నిర్వహించగా.. భారీ ఎత్తున టపాసులు కాల్చారు. చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసు నిలబడదని అచ్చెన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
TDP Leaders Fire on CM Jagan: కక్ష సాధింపులో జగన్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్: లోకేశ్
ఈరోజు సాయంత్రమే జైలు నుంచి బయటకు: చంద్రబాబును ఇక ఏ శక్తి ఆపలేదని వెల్లడించారు. అన్ని కేసులు అక్రమం అని త్వరలోనే తేలిపోతుందని టీడీపీ నేతలు అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి.. చంద్రబాబు భారీ ర్యాలితో అమరావతి రానున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ప్రతి జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు.. రాజమహేంద్రవరం చేరుకుంటునారు. ఈ రోజు సాయంత్రమే చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
బెయిల్ రావడం అభినందనీయం: అక్రమ కేసులో అరెస్టైనా చంద్రబాబుకు నాలుగు వారాల పాటు మంధ్యతర బెయిల్ రావడం అభినందనీయమని.. మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు సంతోషం వ్యక్తం చేశారు. కోట్ల మంది తెలుగు ప్రజలు చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని కోరుకున్నారని ఆయన వివరించారు.
అక్రమంగా అరెస్టు చేసి ఆయన ఆరోగ్యం క్షిణిస్తుందన్నా.. కేవలం ఉద్దేశ్యపూర్వంకగానే కక్ష సాధింపుతో ఇలాంటి చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. ఎప్పటికైనా న్యాయమే గెలిచి తీరుతుందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు.
చంద్రబాబు బెయిల్‌పై కాంగ్రెస్ నేత: టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై.. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ స్పందించారు. చంద్రబాబు స్కిల్ కేసులో బయటకు రావడం సంతోషమైనా.. ఇతర కేసుల్లో మళ్లీ అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా చంద్రబాబును బయటకు పంపించాలన్నారు.
చివరకి న్యాయం గెలిచింది: చంద్రబాబు అరెస్టులో ఎట్టకేలకు న్యాయం గెలిచిందని.. టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మాన్ని ఎంతోకాలం కటకటాల వెనక దాచలేరని మండిపడ్డారు. చంద్రబాబును 50 రోజులు జైలులో కష్టపెట్టారని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో న్యాయం చంద్రబాబు వైపే ఉందని స్పష్టమైందని వివరించారు.
తిరుమల శ్రీవారికి టీడీపీ శ్రేణుల మొక్కులు: స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుమలలో మొక్కుల చెల్లించుకున్నారు. శ్రీవారికి కొబ్బరి కాయలు కొట్టారు.
జగన్.. నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పు: 'నిజం గెలవాలి' యాత్రలో భువనేశ్వరి