గుంటూరు జిల్లా గుండ్లపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడి తలకు బలంగా గాయం కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు అంకిరెడ్డి పాలెంకు చెందిన రామకోటిరెడ్డిగా గుర్తించారు. ఈయన వ్యక్తిగత పనుల నిమిత్తంగా సత్తెనపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి