ETV Bharat / state

పవన్ కల్యాణ్​ను కలిసిందని యువతికి పోలీసుల బెదిరింపులు..! - తాడేపల్లిలో యువతికి పోలీసుల బెదిరింపులు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్​కు చెందిన ఓ యువతిని పోలీసులు బెదిరించారు. తనకు ప్రభుత్వ ఇల్లు రాలేదని.. న్యాయం చేయాలంటూ శివశ్రీ ఇటీవలే పవన్ కల్యాణ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనను కలిసిన కారణంతోనే పోలీసులు బాధిత యువతిని స్టేషన్​కు పిలిపించి హెచ్చరించారు. పోలీస్ స్టేషన్​కు పిలిపించి బెదిరించినట్లు యువతి వాపోయింది.

police warns a girl for meeting pawan kalyan
పవన్ కల్యాణ్​ను కలిసిందని యువతికి పోలీసుల బెదిరింపులు..!
author img

By

Published : Jul 20, 2021, 3:36 PM IST

పవన్ కల్యాణ్​ను కలిసిందని యువతికి పోలీసుల బెదిరింపులు..!

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్​కు ఓ యువతిని.. పోలీసులు బెదిరించారు. తనకు ప్రభుత్వ ఇంటి స్థలం రాలేదని.. న్యాయం చేయాలంటూ శివశ్రీ.. పవన్ కల్యాణ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనను ఎందుకు కలిశావంటూ.. స్థానికంగా ఉన్న పార్టీ యువకులతో కలిసి పోలీసులు బెదిరించారని యువతి ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తాడేపల్లి పోలీసులు.. యువతిని స్టేషన్​కు పిలిపించారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది.

పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందింది. అకారణంగా గొడవ చేస్తే ..కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిపింది. విచారణ పేరుతో సుమారు నాలుగు గంటలకుపైగా స్టేషన్ లో ఉంచారని బాధిత యువతి వాపోయింది.

ఇదీ చదవండి:

'ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? పోలీసులతో కొట్టిస్తారా?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.