గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని, కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురిని, నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురిని, అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిని, మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని, మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని, మొత్తం 20 మంది పిల్లలను పోలీసులు కాపాడారు.
వివిధ మెకానిక్ షెడ్లు, షాపుల్లో పని చేస్తున్న బాల కార్మికులను గుంటూరు అర్బన్ పోలీసులు కాపాడారు. వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ సుగుణాల రాణి ముందు హాజరుపర్చారు. వారిని విచారించి వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు. సదరు బాలబాలికలకు మాస్కులు, శానిటైజర్స్, పేస్టులు, బ్రష్ లు, విటమిన్ చాక్లెట్స్ అందజేశారు. కరోనాపై వారికి అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి మందుషాపుల ముందు మందుబాబుల తోపులాట