ETV Bharat / state

ఆన్​లైన్​లో విగ్రహాలు బుక్ చేసి..ఆ తరువాత..!

విగ్రహాల ఆర్డర్ పేరిట శిల్పులను కొంత మంది వ్యక్తులు మోసం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

online fraud on statues at tenali  online fraud on statues at tenali news  tenali statues  tenali upadates  తెనాలిలో సైబర్ మోసం  తెనాలిలో సైబర్ మోసం వార్తలు  తెనాలిలో విగ్రహాలు  తెనాలిలో విగ్రహాలువార్తలు  తెనాలిలో విగ్రహాలు తాజా వార్తలు
ఆన్​లైన్​లో విగ్రహాలు
author img

By

Published : Dec 10, 2020, 10:43 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలో విగ్రహాల ఆర్డర్ పేరుతో ఓ శిల్పిని మోసం చేశారు కొంతమంది దుండగులు. తెనాలిలో విగ్రహాల తయారీకి పేరుగాంచిన శ్రీరాం అనే శిల్పికి కొద్దిరోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. మేం సచివాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు విగ్రహాలు బాగా తయారు చేస్తున్నారు. దేశవిదేశాల్లో మీకు మంచి పేరుంది. ప్రభుత్వం తరపున అన్ని పాఠశాలల్లో అంబేద్కర్, మదర్ థెరిస్సా విగ్రహాలు పెడుతున్నామని..ఒక్కొక్కటి వెయ్యి చొప్పున మూడు వేల విగ్రహాలు కావాలని చెప్పారు. విగ్రహాల ఖరీదు, ఎంత సమయం తీసుకుంటారని అడిగారు. ఆ తర్వాత మీకు వెండర్ లైసెన్స్ ఉందా అని అడగ్గా ఆ శిల్పి లేదని సమాధానమిచ్చారు. దీంతో 16వేలు నా ఆకౌంట్​కు పంపండని.. రెండు రోజుల్లో లైసెన్స్ ఏర్పాటు చేస్తామని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు.

ఆ వ్యక్తి మాటలు నమ్మి ఫోన్​పే అకౌంట్ ద్వారా రూ. 16వేలు పంపించారు. అయితే డబ్బులు ఇంకా రాలేదని చెప్పగా... సాంకేతిక సమస్య అయి ఉంటుందని రెండోసారి కూడా నగదు బదిలీ చేశాడు. మళ్లీ మరుసటి రోజు ఫోన్ చేసి మీరు నా వ్యక్తిగత ఖాతాకు డబ్బు పంపారు. ప్రభుత్వ ఖాతాకు పంపాలని మరో నంబర్ ఇచ్చారు. మీరు పంపిన డబ్బుకి సంబంధించి చెక్కు ఇస్తామని నమ్మబలికాడు. సరేనని మూడోసారి కూడా ఆ శిల్పి డబ్బు బదిలీ చేశాడు. ఐతే ఆ తర్వాత ఫోన్ చేసేందుకు యత్నించగా ఆ నంబర్ స్విచాఫ్ అని వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు ఆ శిల్పి గ్రహించారు. ఆ మోసాగానికి శిల్పి... మొత్తం 46 వేల రూపాయలు చెల్లించారు.

పట్టణంలోనే సూర్య శిల్పశాలకు చెందిన కాటూరి వెంకటేశ్వరరావుకు కూడా ఇలాగే ఫోన్ చేసి డబ్బు పంపాలని అడిగాడు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఆర్డర్ కాపీ ఉంటే పంపాలని వెంకటేశ్వరరావు కోరగా... ఒక జీవో వాట్సప్ చేశాడు ఆ వ్యక్తి. అయితే అది వ్యవసాయశాఖకు సంబంధించినదని.. శిల్పి కుమారుడు గుర్తించి అది జీవో అని తెలిపాజు. ఆ విషయంపై అడిగితే ఫోన్ కట్ చేసి స్విచాఫ్ చేశాడు. అగంతకుని చేతిలో మోసపోయిన శిల్పి శ్రీరాం తెనాలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా ఎవరైనా ఇలాగే మోసపోయారా అని ఆరా తీస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చూడండి.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.