సీఎం జగన్ పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే.. గుంటూరు జిల్లాలో మరో దారుణం జరగడం బాధాకరమన్నారు. బైక్ పై వెళ్తున్న జంటపై నలుగురు దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడడం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు. ఫిర్యాదు చెయ్యడానికి వెళితే తమ పరిధిలోకిరాదంటూ.. వేరే స్టేషన్‌కు వెళ్లండంటూ పోలీసులు చెప్పడం ఇంకా ఘోరమని లోకేశ్ దుయ్యబట్టారు. ఇంత విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఆడబిడ్డని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా తనను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసుల్ని రంగంలోకి దింపారని లోకేశ్ దుయ్యబట్టారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకి జగన్ రెడ్డి వాడుకోవడం వల్లే .. రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని లోకేశ్ ధ్వజమెత్తారు.
lokesh: 'సీఎం జగన్ పాలనలో అఘాయిత్యాలకు రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారింది'
గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. బైక్‌పై వెళ్తున్న జంటపై దాడిచేసి అత్యాచారానికి పాల్పడటం అమానుషమని అన్నారు. ఫిర్యాదు కోసం వెళ్తే తమ పరిధి కాదని పోలీసులు చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.