నక్కా ఆనందబాబు మీడియా సమావేశం అగ్రిగోల్డ్ బాధితులను గత ప్రభుత్వం మోసం చేసిందన్న సీఎం జగన్ వ్యాఖ్యలను మాజీమంత్రి నక్కా ఆనందబాబు తప్పుబట్టారు. డిపాజిటర్లను మోసం చేసినందుకు అగ్రిగోల్డ్ యజమానులను చంద్రబాబు హయాంలోనే అరెస్టు చేయించారని... ఆస్తులను ఆటాచ్ చేశారని ఆయన గుర్తు చేశారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కోర్టు ద్వారా ప్రత్యేక అనుమతి పొంది డిపాజిటర్లకు పరిహారం ఇచ్చేందుకు తెదేపా ప్రభుత్వం జీవో కూడా తెచ్చిందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దానికంటే తక్కువ నిధులు విడుదల చేసి వైకాపా గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు ఆపివేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆనందబాబు స్వాగతించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనుల్ని నిలిపివేసి.. తమ సొంతవారికి కట్టబెట్టుకున్నారని వైకాపాపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు పనులు సజావుగా జరిగేలా చూడాలని హితవు పలికారు.
ఇదీ చదవండి :
చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ...