ముఖ్యమంత్రి జగన్.. తన కులం, మతానికి మాత్రమే సీఎంలాగా వ్యవహరిస్తున్నారని తెలుగుయువత నాయకుడు నాగమల్లేశ్వరరావు విమర్శించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు ఇతర మతస్థులను కించపర్చేలా వ్యవహరించలేదన్నారు.
ఎన్నికల ముందు హిందువుగా మతం మారినట్లు ప్రచారం చేసుకున్న జగన్.. ఇపుడు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: ఏ-1 ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ