ETV Bharat / state

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తాం: వైకాపా ఎంపీ

author img

By

Published : Dec 24, 2019, 4:56 PM IST

అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీఇచ్చారని... ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, అందరనీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ అమలును వైకాపా ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

lavu srikrishna devarayalu
లావు శ్రీకృష్ణదేవరాయలు

మీడియాతో మాట్లాడుతున్న లావు శ్రీకృష్ణదేవరాయలు

మూడు రాజధానులు వచ్చినా... అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఎన్​ఆర్​సీ (జాతీయ నమూనా పట్టిక)పై ఎంపీ మాట్లాడారు. దేశవ్యాప్త ఎన్​ఆర్​సీని వైకాపా వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు. కేంద్రం ఎన్​ఆర్​సీ బిల్లు తెస్తే... దానిని ఆంధ్రప్రదేశ్​లో అమలు చేయబోమని ఎంపీ అన్నారు.

ఇదీ చదవండి :

ఎన్‌ఆర్‌సీకి మేం వ్యతిరేకం: సీఎం జగన్‌

Intro:ap_gnt_81_24_mp_laavu_srikrishnadhevarayulu_pressmeet_avb_ap10170

మొదట రాజధాని రైతులకే న్యాయం జరుగుతుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ.

మూడు రాజధానుల అంశం పక్కన పెడితే మొదటగా భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆన్నారు. నరసరావుపేట వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.Body:కార్యక్రమంలో ముందుగా ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఎన్ ఆర్ సి బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయబోమని హామీ ఇచ్చారు. అనంతరం రాజధాని గురించి మాట్లాడారు. మూడు రాజధానుల అంశం పక్కనపెట్టి రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాజధాని మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఏ రైతు కొరలేదన్నారు.Conclusion:అప్పటి ప్రభుత్వం కోరితే రైతులు స్పందించి స్వచ్చందంగా రైతులు భూములిచ్చారన్నారు. అటువంటి రైతుకు ఈ రోజు నష్టం జరగకుండా చూడాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఆలోచనగా ఎంపీ తెలిపారు.

బైట్: లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట వైసీపీ ఎంపీ.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9886066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.