ETV Bharat / state

మూగజీవి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ మంత్రి మల్లారెడ్డి - మానవత్వాన్ని చాటుకున్న మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy Humanity : సాధారణంగా రోడ్డుపై ప్రమాదాలు జరిగి జంతువులు ఆపదలో ఉంటే వీఐపీలు చూసీచూడనట్టు తమకెందుకులే అని వెళ్లిపోతుంటారు. కానీ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇందుకు భిన్నంగా వ్యవహరించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా మార్గమధ్యలో ఓ మూగజీవి ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవస్థలు పడుతుండగా మంత్రి ఆ జీవిని కాపాడారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Minister Mallareddy
మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Jan 11, 2023, 7:16 PM IST

Minister Mallareddy Humanity : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మూగ జీవి ప్రాణాలను కాపాడి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్తు స్తంభంలో ఆవు తల ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్న దృశ్యాన్ని గమనించిన మంత్రి.. కాన్వాయ్‌ను ఆపి మూగజీవిని కాపాడారు. జవహర్​నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్యక్రమానికి హాజరైన మంత్రి.. తిరిగి బోయిన్‌పల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూగజీవాల పట్ల తనకున్న ప్రేమను మంత్రి మల్లారెడ్డి మరోసారి చాటుకున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మూగజీవి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి మల్లారెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.