గుంటూరు(gunturu) జిల్లా కొర్నేపాడులో జరిగిన ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత(mekathoti sucharitha), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడారు. పేదల ఇంటి స్థలాల(house sites) కోసం 9 వేల కోట్ల రూపాయల వ్యయం చేసినట్లు తెలిపారు. ప్లాట్ల అభివృద్ధి ద్వారా ఒక్కొక్కరికి 7 నుంచి 10లక్షల విలువైన స్థలం వస్తుందన్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇంత భారీ స్థాయిలో గృహనిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని సొంతింటి కల నెరవేర్చుకోవాలని సూచించారు.
వైఎస్ హయాంలో ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగిందని... ఆ తర్వాత ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేశాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు(chandrababu) ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో(tidco) గృహాలు నివాసయోగ్యంగా లేవన్నారు. అందులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. గృహాల నిర్మాణానికి సంబంధించి సమస్యలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల అన్నారు.
ఇదీ చదవండి: Viral: టీ స్టాల్లో ప్లేట్లు కడిగిన వానరం!