మినీ లారీలో తరలిస్తున్న 27 లక్షల రూపాయల విలువైన గుట్కాలను గుంటూరు జిల్లా మెడికొండ్రు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ మినీలారీలో సోదాలు చేశారు.
24 బస్తాల మిరాజ్, 44 బస్తాల జోడాబుల్ గుర్తించామని సీఐ ఆనందరావు తెలిపారు. వీటి విలువ రూ. 27 లక్షలు అని తెలిపారు. సరుకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.
ఇదీ చదవండి: