గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలను కలిపి కార్పొరేషన్‌గా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 పురపాలక సంఘాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ రెండింటిలో సుమారు 2 లక్షల 60వేల మంది జనాభా ఉన్నారని చెప్పారు.
జులై 8న మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాల్లో 50వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో జనాభా 3 లక్షలు దాటుతుందని.. ఆ విధంగా కార్పొరేషన్ చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈనెల 15న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో 2 పురపాలక సంఘాల అధికారులు సమావేశమవుతారని.. దాని తర్వాత కార్పొరేషన్ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని తెలిపారు.
ఇవీ చదవండి.... ట్రెండింగ్‌లో 'ఉయ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు' హ్యాష్ టాగ్