అప్పికట్లలో కాశీ విశ్వేశ్వరస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశాలాక్షి, అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. తాటి బొత్తలతో తయారు చేసిన రథంపై గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో స్వామికి ఉపసభాపతి దంపతులు కోన రఘుపతి, రమాదేవి ప్రత్యేక పూజలు చేశారు.
నిన్న రాత్రి మెుదలైన ఉత్సవం ఈ రోజు ఉదయం వరకు కొనసాగింది. నందమూరి, పరిటాల యువసేన ఆధ్వర్యంలో ఉత్సవంలో పాల్గొన్న వారికి అల్పాహారం పంపిణీ చేశారు. తిరునాళ్లలో భాగంగా ఆలయ ఆవరణలో నేడు భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని చేపటనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: