లాక్‌డౌన్ కారణంగా ఉద్యాన రైతులు మార్కెటింగ్ సౌకర్యం, మద్దతు ధరల్లేక నష్టాలపాలవుతున్నారు. మరోవైపు డిమాండ్ బాగా పెరిగిపోతుండటంతో... బహిరంగ మార్కెట్లలో ఫలాల ధరలు విపరీతంగా పెరిగి వినియోగదారులూ నష్టపోతున్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. రైతులకు మద్దతు ధర చెల్లించి.. కొనుగోలు చేసిన వివిధ రకాల పండ్లను కిట్లుగా తయారుచేసి... ప్రజలకు తక్కువ ధరకే అందిస్తోంది. గుంటూరు జిల్లాలో ఉద్యానశాఖ చేపడుతున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు