ETV Bharat / state

'ప్రభుత్వం ఆదుకోకుంటే పొలాల్లోనే ప్రాణాలు తీసుకునే పరిస్థితి'

నివర్ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో తీవ్ర పంట నష్టం జరిగింది. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఈ దుస్థితిలో చూసిన అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే వరద బారిన పడిన పొలాల్లోనే ప్రాణాలు వదిలే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

grain crop damaged in guntur
గుంటూరు జిల్లాలో భారీ పంట నష్టం
author img

By

Published : Nov 28, 2020, 7:03 PM IST

నివర్ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రెండు మండలంల్లోని పలు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కోయడానికి సిద్ధంగా ఉన్న పంటను ప్రస్తుత పరిస్థితిలో చూసిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రెండు రోజుల క్రితం వరి కంకులతో కళకళాడిన పైరు నేడు వర్షార్పణం కావడం వల్ల అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి 35 వేలు పెట్టుబడి పెట్టామని.. 10 వేలైనా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే వరద బారిన పడిన తమ పొలాల్లోనే ప్రాణాలు వదిలే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ వైపు పంట మునిగి ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు నూర్పిడి చేసి పంటగింజలను ఆరబెట్టుకున్న రైతుల పరిస్థితి మరోలా ఉంది. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి మొలకలెత్తడం చూసి నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు 17 బస్తాలు కౌలుకు తీసుకున్నామని.... ఇపుడు కనీసం 10 బస్తాలైనా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

వర్షపాతం..

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 9.5 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మాచర్ల మండలంలో 50.6 నమోదు కాగా వెల్దుర్తి 23.6, నూజెండ్ల 20.2, దాచేపల్లి 18.6, దుర్గి 18.4, కారంపూడి 18.4, రెంటచింతల 15.6, బెల్లంకొండ 15.2, ప్రత్తిపాడు 15.2, బాపట్ల 14.2, వినుకొండ 12.2, రొంపిచర్ల 12, నరసరావుపేట 11.8, పిడుగురాళ్ల 11.8, గురజాల 11.6, చిలకలూరిపేట 11.4, చెరుకుపల్లి 11.2, బొల్లాపల్లి 11, కొల్లూరు 11, వేమూరు 10.8, శావల్యాపురం 10.6, ఈపూరు 10.4, నగరం 10.2, పి.వి.పాలెం 10.2, యడ్లపాడు 10, ఫిరంగిపురం 8.6, నకరికల్లు 8.4, నిజాంపట్నం 8.2, పొన్నూరు 8.2, సత్తెనపల్లి 8, మాచవరం 7.4, నాదెండ్ల 7.2, రాజుపాలెం 6.6, అమరావతి 6.4, కాకుమాను 6.4, భట్టిప్రోలు 6.2, దుగ్గిరాల 6.2, కొల్లిపర 5.8, పెదనందిపాడు 5.6, రేపల్లె 5.6, అమృతలూరు 5.4, చుండూరు 5.4, కర్లపాలెం 5.2, పెదకూరపాడు 5.2, మేడికొండూరు 5, చేబ్రోలు 4.8, తెనాలి 4.2, క్రోసూరు 3.8, మంగళగిరి 3.8, పెదకాకాని 3.6, తుళ్లూరు 3.4, అచ్చంపేట 2.4, గుంటూరు 2.4, తాడేపల్లి 2.4, తాడికొండ 2.4, వట్టిచెరుకూరు 2.2, ముప్పాళ్ల 1.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్‌ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.