ETV Bharat / state

Health problems Due to Poor Quality Alcohol in AP: వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన మద్యం.. నాలుగేళ్లుగా గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 10:04 AM IST

Health problems Due to Poor Quality Alcohol in AP: ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం మద్యం వల్ల కాలేయం, క్లోమగ్రంధి దెబ్బతిని ఆసుపత్రుల పాలయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. నాలుగేళ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది. వేగంగా ఆరోగ్యం క్షిణించి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నాసిరకం మద్యానికి బడుగు, బలహీనవర్గాల నిరుపేదలే బలవుతున్నారు.

health_problems
health_problems

Health problems Due to Poor Quality Alcohol in AP: వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన మద్యం.. నాలుగేళ్లుగా గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు

Health problems Due to Poor Quality Alcohol in AP: ఆంధ్రప్రదేశ్‌ను మద్యం బాధిత అనారోగ్య సమస్యల ఉపద్రవం ముంచెత్తుతోంది. కాలేయం, క్లోమగ్రంధి దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య గత నాలుగేళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. వీరిలో పలువురి ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. తరచూ మద్యం తాగే అలవాటున్నా సరే.. కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10-15 ఏళ్లు పడుతుంది. కానీ ఏపీలో ఓ మాదిరిగా తాగే అలవాటున్నవారికీ నాలుగేళ్లలోనే కాలేయం పాడైపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో లభించే నాసిరకం మద్యం వల్లే ఇంత త్వరగా కాలేయం పాడైపోతోందని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ బాధితుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాల పేదలే ఉంటున్నారు. రోజు కూలీలుగా పనిచేస్తూ తమకొచ్చే ఆదాయంలో సగానికిపైగా మద్యానికే వెచ్చిస్తున్నారు. నెలల వ్యవధిలోనే ఆరోగ్యం క్షీణించిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దదిక్కు కోల్పోయి వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడుతున్నారు. బాధితుల్లో యువత కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Skill Development Program vs Smart Meters Project: స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ ఐతే.. స్మార్ట్ మీటర్లతో ప్రజాధనం దుర్వినియోగం కాదా..?

ఎగువ మధ్యతరగతి, ఉన్నతస్థాయివర్గాల వారు నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో లభించే మద్యం జోలికే వెళ్లట్లేదు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి ప్రీమియం బ్రాండ్లు తెప్పించుకుని అవే తాగుతున్నారు. మద్యం అలవాటు మానుకోలేక.. వారు కోరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించక తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నవాటిని తాగుతున్న పేద, మధ్యతరగతి వారే చివరికి సమిధలుగా మారి బలైపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉంది. మద్యం తాగే అలవాటు కొన్నేళ్లుగా ఉన్నా.. ఇంతటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ముందెన్నడూ లేవని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈటీవీ-ఈనాడు ప్రతినిధులు పరిశీలించి.. బాధితులతో మాట్లాడినప్పుడు వారి దయనీయస్థితి వెల్లడైంది.

Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లోని ఉదరకోశ వ్యాధుల విభాగానికి వస్తున్నవారిలో 40శాతం మంది మద్యం తాగేవారే ఉంటున్నారు. చాలామంది కాలేయం మారిస్తే తప్ప బతకని పరిస్తితిలో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య.. 2020తో పోలిస్తే 2023లో 108శాతం పెరిగింది. అయిదారేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మద్యం తాగేవారు వివిధ సమస్యలతో ఆసుపత్రికి రావటం పెరిగిందని వైద్యుడు చెబుతున్నారు. మద్యం సంబంధిత అనారోగ్యంతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో నెలకు సగటున 15నుంచి 16 మంది చేరుతున్నారు. వీరిలో ఎక్కువమంది చేతులు, కాళ్లు వణకడం, నిద్రలేమి, వాంతులు, విపరీతమైన చెమట, మాట సరిగ్గా రాకపోవటం తదితర సమస్యలతో వస్తున్నారు. మద్యపానం వల్ల క్లోమగ్రంధి సమస్యలతో వస్తున్నవారి సంఖ్య తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే చాలా ఎక్కువగా ఉందని.. నరసరావుపేటకు చెందిన వైద్యుడు తెలిపారు.

Palnadu District: "అరాచకాలకు చిరునామా.. ఆంధ్రా చంబల్‌లోయ".. అక్కడ బతకాలంటే ప్రజాప్రతినిధికి జీ హుజూర్‌ అనాల్సిందే

Vijayawada GGH: విజయవాడ జీజీహెచ్‌లోని ఉదరకోశ వ్యాధుల విభాగానికి వస్తున్న వారిలో 30-40శాతం మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే ఉంటున్నారు. ప్రతివారం సగటున 100-150 మధ్య ఓపీ ఉంటోంది. గతవారం ఓపీలో చూపించుకున్నవారిలో 90 మంది పురుషులు కాగా.. వారిలో 30 మంది మద్యపానం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారే ఉన్నారు.

Elur: ఏలూరు వైద్యకళాశాలలోని ఉదరకోశ వ్యాధుల విభాగంలో ప్రస్తుతం 40 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే 11 మంది ఉన్నారు. ఇలాంటి సమస్యలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 2019 కంటే ముందు నెలకు 15 మంది చికిత్స పొందేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 40కి పెరిగింది. ఉదరకోశవ్యాధుల విభాగానికి సంబంధించిన మూడు ప్రైవేటు ఆసుపత్రులకు రోజూ సగటున 500 మంది వరకూ ఓపీకి వస్తున్నారు. వీరిలో మద్యం సంబంధిత అనారోగ్యంతో వచ్చేవారే 150 మంది వరకూ ఉన్నారు.

Kakinada GGH: కాకినాడ జీజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య నెలకు సగటున 260 నుంచి 270 మంది వరకూ ఔట్‌పేషెంట్లు వచ్చారు. వారిలో సగటున 27నుంచి 30 మంది వరకూ ఇన్‌పేషెంట్లుగా చేరారు.

Jagannana Suraksha for YCP Campaign: ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి.. జగనన్న ఆరోగ్య సురక్షతో పార్టీ ప్రచారం ముమ్మరం చేయండీ!

Visakhapatnam KGH: విశాఖపట్నం కేజీహెచ్‌లోని ఉదరకోశ వ్యాధుల విభాగంలో 2021 జులై నుంచి 2022 జూన్‌ మధ్య 1,060 మంది చేరగా.. వారిలో 471 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరినవారే. ఏడాది వ్యవధిలో వారిలో 36మంది చనిపోయారని అధికారులు చెబుతున్నా వారానికి ఇద్దరు చనిపోతున్నారని సిబ్బంది చెబుతున్నారు. కేజీహెచ్‌ ఉదరకోశ వ్యాధుల విభాగం వార్డులో 37మంది చికిత్స పొందుతుండగా వారిలో 25 మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అనకాపల్లి జిల్లాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

Kurnool GGH: కర్నూలులోని జీజీహెచ్‌లోని ఉదరకోశవ్యాధుల విభాగంలో సెప్టెంబరు 25న పరిశీలిస్తే 37మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. వారిలో 22 మంది మద్యం వల్ల అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతున్నవారే ఉన్నారు. ఉదరకోశ వ్యాధుల విభాగానికి సోమ, గురువారాల్లో ఓపీ చూస్తారు. ఆ రెండురోజుల్లో వందమంది వరకూ కాలేయ సంబంధిత సమస్యలతో వైద్యం కోసం వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మద్యం అలవాటున్నవారే ఉంటున్నారు.

Anantapur: అనంతపురం సర్వజన ఆసుపత్రికి నెలకు 230 నుంచి 240 మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో వస్తున్నారు. వారిలో 50నుంచి 60 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. మూడేళ్లలో మద్యం వల్ల అనారోగ్యం బారిన పడి 5,093 మంది ఈ ఆసుపత్రిలో చేరారు.

YCP Govt Paying Bills Only Jagan Followers: 'వరుస' తప్పిన వైసీపీ సర్కారు..! పక్కదోవలో జగన్ అనుచరులకు వేల కోట్ల పందేరం

Tirupati: తిరుపతి రుయా ఆసుపత్రిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి కాలేయ సమస్యలతో రోజుకు 70నుంచి 100 మంది వరకూ ఔట్‌పేషెంట్లు వస్తున్నారు. వారిలో 20నుంచి 25 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. అందులో 80శాతం మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరినవారే.

Kadapa: కడప సర్వజన ఆసుపత్రికి కాలేయ సమస్యలతో గతంలో నెలకు 5నుంచి10 మంది వచ్చేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 40నుంచి 50కి పెరిగింది.

Ongole GGH: ఈ ఏడాది ఒంగోలు జీజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో చేరుతున్నవారి సంఖ్య ప్రతినెలా పెరుగుతూనే ఉంది. జనవరిలో 83 మంది, ఫిబ్రవరిలో 127, మార్చిలో 131, ఏప్రిల్‌లో 114, మేలో 135, జూన్‌లో 131, జులైలో 134, ఆగస్టులో 142, సెప్టెంబరులో 180మంది చేరారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కొక్కరూ 2నుంచి 4వారాల పాటు ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తోంది.

Nellore: నెల్లూరు రామచంద్రారెడ్డి ఆసుపత్రికి కాలేయ, ఉదర సమస్యలతో రోజూ 150 మంది వరకూ ఔట్‌పేషెంట్లు వస్తుండగా.. వారిలో 90మంది వరకూ మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే. ఈ సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్నవారు గత రెండేళ్లలో రెట్టింపయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.