గుంటూరు మిర్చి యార్డులో కొనుగోలు, అమ్మకాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లు మిర్చి యార్డు ఛైర్మన్ ఏసురత్నం వెల్లడించారు. యార్డులోకి వచ్చేవారికి తగిన జాగ్రత్తలు తీసుకొని లోనికి అనుమతిస్తారు. అలాగే కమీషన్ ఏజేంట్లు, హమాలీలు రెండు బృందలుగా విడదీసి ఒక్కో బృందం రోజు మార్చి రోజు వచ్చేలా చర్యలు చేపట్టారు. యార్డులో లావాదేవీలు లేని కారణంగా వందల కోట్ల రూపాయల విలువైన సరకు గోదాముల్లో ఉండి పోయింది. మార్కెట్లో అమ్మకాలు మొదలైతే రైతులు పంట విక్రయించుకునే వెసులుబాటు కలగనుంది.
ఈనెల 25 నుంచి గుంటూరు మిర్చి యార్డు ప్రారంభం - ఈ నెల 25నుంచి గుంటూరు మిర్చి యార్డు ప్రారంభం
గుంటూరు మిర్చి యార్డులో కొనుగోలు, అమ్మకాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు యార్డు ఛైర్మన్ వెల్లడించారు.