రాష్ట్ర నలుమూలల నుంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పించామని డెరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కె.కన్నబాబు తెలిపారు. గతేడాది కంటే ఈ సంవత్సరం 41 శాతం అధికంగా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ విజయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మార్కులు పొందిన రోహిణి ప్రియంవద, దినేష్, గణేష్‌ను ఆయన అభినందించారు. స్టేట్ ర్యాంకులు సాధించిన వారికి ప్రతి సంవత్సరం 12వేల చొప్పున 4ఏళ్లపాటు ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ విజయం మున్సిపల్ పాఠశాలలకు గర్వకారణమని ప్రశంసించారు.
ఇవీ చదవండి..