Governor on Gandhi: దేశవ్యాప్తంగా షహీద్ దివస్‌గా జరుపుకునే అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతిపిత మహాత్మా గాంధీజీకి నివాళి ప్రకటించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి గాంధీజీ చేసిన కృషి మాటల్లో చెప్పలేమని అన్నారు. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలని చెప్పిన మహోన్నతుడు గాంధీజీ అని గుర్తు చేసుకున్నారు. తన శాంతియుత విధానాల ద్వారా బ్రిటీష్ వారు భారతదేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు. గాంధీజీ ఎజెండా, విధానాలు అహింసాత్మకమైనవి కాగా, ఆయన సందేశాలు దేశంలోని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని తెలిపారు.
స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం తదితర ఉద్యమాలు రక్తపాత రహితంగా సాగాయన్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న లక్ష్యంతో అనేక గొప్ప ఉద్యమాలకు గాంధీజీ నేతృత్వం వహించారని గుర్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు.
ప్రబలంగా ఉన్న ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా.. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: New Districts In AP: రాష్ట్రంలో కొత్త జిల్లాల కుంపటి.. కొనసాగుతున్న ఆందోళనలు