ETV Bharat / state

అన్నదాతలకు తీపి కబురు.. ఆ గోదాముల్లో ధాన్యం నిల్వకు అవకాశం - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ గోదాముల్లో రైతులు ధాన్యం నిల్వ చేసుకోవటానికి ఎట్టకేలకు అవకాశం లభించింది. హైకోర్టు ఉత్తర్వులతో మార్కెటింగ్‌ సెస్సు వసూలు చేస్తున్న అధికారులు గోదాములను అన్నదాతలకు అందుబాటులోకి తెచ్చారు.

Good News to Farmers
Good News to Farmers
author img

By

Published : May 2, 2021, 1:54 PM IST

మార్కెటింగ్‌ శాఖ గోదాముల్లో రైతులు ధాన్యం నిల్వ చేసుకోవటానికి ఎట్టకేలకు ఐదు నెలల తర్వాత అవకాశం లభించింది. హైకోర్టు ఉత్తర్వులతో మార్కెటింగ్‌ సెస్సు వసూలు చేస్తున్న అధికారులు గోదాములను అన్నదాతలకు అందుబాటులోకి తెచ్చారు. ఇన్నాళ్లు ధాన్యం నిల్వ చేసుకోవటానికి గోదాములు అందుబాటులో లేకపోవటంతో మార్కెట్లో వచ్చిన ధరకు విక్రయించి ఆదాయం కోల్పోయారు. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు రావటంతో ఖరీఫ్, రబీ సీజన్లలో పండించిన ధాన్యం గోదాముల్లో నిల్వ ఉంచి మంచి ధర వచ్చిన తర్వాత విక్రయించుకోవటం ద్వారా సాగుదారులకు లబ్ధి చేకూరనుంది.

గుంటూరు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 2.52 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. ధాన్యంపై ఒక శాతం మార్కెటింగ్‌ సెస్సు ద్వారా మార్కెట్ యార్డులకు ఏటా రూ.120 కోట్ల ఆదాయం లభిస్తోంది. గతేడాది కేంద్రం ఈ సెస్సును రద్దు చేసింది. ఒక్కసారిగా యార్డుల ఆదాయం పడిపోయింది. ఈ నేపథ్యంలో యార్డుల్లో గోదాముల్లో రైతులు నిల్వ చేసిన పంట ఉత్పత్తులను ఖాళీ చేయాలని నవంబరు నుంచి మార్కెటింగ్‌ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. జనవరి నాటికి గోదాములను ఖాళీ చేయించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వటం ద్వారా మార్కెటింగ్‌ సెస్సు రద్దు ద్వారా కోల్పోయిన ఆదాయం తిరిగి రాబట్టాలని భావించారు. గృహ నిర్మాణ, పౌరసరఫరాల శాఖలు పది నుంచి 20 శాతం గోదాములను మాత్రమే లీజుకు తీసుకున్నాయి. 80 శాతం గోదాములు ఖాళీగా ఉన్నాయి.

రబీ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు: హైకోర్టు ఆదేశాలతో మార్చి చివరి వారం నుంచి మరలా మార్కెటింగ్‌ సెస్సు వసూలును అధికారులు ప్రారంభించారు. ఖాళీగా ఉన్న గోదాముల్లో రైతులు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవటానికి మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ అనుమతి ఇచ్చారు. ధాన్యం మార్కెట్ తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. 40 శాతానికి పైగా ఖరీఫ్‌ ధాన్యం ఇంకా రైతుల వద్ద ఉంది. రబీ ధాన్యం నూర్పిడులు జరుగుతున్నాయి. పౌరసరఫరాల శాఖ రబీ ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. గ్రేడ్‌-ఏ రకం ధాన్యానికి 75 కేజీల బస్తాకు రూ.1416, సాధారణ రకానికి రూ.1401ను కనీస మద్దతు ధరగా అధికారులు నిర్ణయించారు. మార్కెట్లో పాత ధాన్యానికి 75 కేజీల బస్తాకు రూ.1800 వరకు ధర లభిస్తోంది. సాధారణంగా వరి కుప్పల నూర్పిడులు చేసి జనవరి నుంచి రైతులు మార్కెట్యార్డు గోదాముల్లో ధాన్యం నిల్వ చేసి ఆరు నుంచి ఎనిమిది నెలల ధర మంచి ధర పలికే సమయంలో విక్రయించి ఆదాయం పొందుతున్నారు. ఈ ఏడాది మార్కెటింగ్‌ శాఖ ఆంక్షల కారణంగా కొత్త ధాన్యాన్ని నిల్వ చేయటానికి సాధ్యపడలేదు. కల్లంలో నూర్చిన ధాన్యాన్ని వ్యాపారులు, మిల్లర్లు, పౌరసరఫరాల శాఖకు విక్రయించారు. కొందరు కుప్పలు నూర్చలేదు.

  • జిల్లాలో మార్కెట్ యార్డులు-21
  • గోదాముల నిల్వ సామర్థ్యం-2.72 లక్షల మెట్రిక్‌ టన్నులు

రైతుబంధు పునరుద్ధరణకు వినతి..

ప్రస్తుతం ఖరీఫ్, రబీ సీజన్లలో పండించిన ధాన్యం నూర్పిడులు చేస్తున్నారు. మార్కెట్లో ధాన్యం ధర తక్కువగా ఉంది. మార్కెట్ యార్డు గోదాములు అందుబాటులోకి రావటంతో ధాన్యం విక్రయించకుండా కల్లాల్లో, ఇళ్ల వద్ద ఉంచిన రైతులు ట్రాక్టర్లలో ఏఎంసీలకు తరలిస్తున్నారు. గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యానికి రైతుబంధు పథకం కింద 80 శాతం విలువ వరకు రైతులకు గరిష్ఠంగా రూ.2 లక్షల రుణం ఇచ్చేవారు. రైతుబంధు పథకం పునరుద్ధరించి గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని రుణాలు మంజూరు కష్టకాలంలో ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ధాన్యాన్ని నిల్వ చేసుకోవటం ద్వారా వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతిని నష్టపోతామన్న భయం లేకుండా పోయింది. మంచి ధర వచ్చిన సమయంలోనే విక్రయించుకోవటం ద్వారా ఆదాయం పెరిగి ఆర్థికంగా లబ్ధి పొందనున్నారు.

ఉన్నతాధికారుల నుంచి అనుమతి
గోదాముల్లో రైతులు ధాన్యం నిల్వ చేసుకోవటానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చింది. రైతుబంధు పథకం కింద రుణాలు మంజూరు చేయటానికి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు మార్కెటింగ్‌ శాఖ చెక్‌పోస్టుల్లో ధాన్యం, వేరుశనగ, ఇతర పంట ఉత్పత్తులకు ఒక శాతం సెస్సు వసూలు చేస్తున్నాం. ఏఎంసీ గోదాముల్లో రైతులు ధాన్యం నిల్వ చేసుకుంటున్నారు. - మోహనరావు, ఏఎంసీ కార్యదర్శి

ఇదీ చదవండి

ఆ మార్గంలో ప్రత్యేక రైళ్లు రద్దు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.