ETV Bharat / state

కాళ్లు మొక్కుతా..కాపాడు సారూ! కంటతడి పెట్టించిన రైతు గోడు - Kamareddy District farmers issues

తాను సాగుచేస్తున్న పంట పొలం నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు తీసుకెళ్తూ పొలాన్ని నాశనం చేస్తున్నారని తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్​ మండలం కేమ్​రాజ్​కల్లాలి గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చుట్టూ ముళ్ల కంచె వేస్తే దాడి చేశారని, వాళ్లపై కేసు నమోదు చేసి తన పంటను కాపాడాలంటూ పోలీసు అధికారుల కాళ్లు పట్టుకున్నాడు.

కాళ్లు మొక్కుతా..కాపాడు సారూ! కంటతడి పెట్టించిన రైతు గోడు

author img

By

Published : Dec 5, 2020, 4:35 PM IST

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేమ్​రాజ్​కల్లాలి గ్రామానికి చెందిన మారుతి అనే రైతు పొలం నుంచి కొంత మంది ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు తీసుకెళ్తుండటం వల్ల పంట పొలం నాశనమవుతోంది. వాహనాలు వెళ్లకుండా పొలం చుట్టూ ముళ్ల కంచె వేస్తే వాహనదారులు తనపై దాడి చేశారని పోలీసు అధికారుల వద్ద మారుతి తన గోడు వెల్లబోసుకున్నాడు.

వాళ్లపై కేసు నమోదు చేసి తన పంటను కాపాడాలంటూ అధికారుల కాళ్లు పట్టుకోబోయిన ఆ రైతును చూసి అక్కడున్నవారు ఆవేదన చెందారు. ఠాణా సమీపంలో ఇద్దరు చిన్నారులతో పాటు భార్య, కోడలు అటుగా వచ్చిన కానిస్టేబుల్​కు సమస్య చెబుతూ కాళ్లావేళ్లా పడే ప్రయత్నం చేశారు. ఊళ్లోకి వెళ్తే మళ్లీ తనపై, తన కుటుంబంపై దాడి చేస్తారని, రక్షణ కల్పించే వరకు వెళ్లనని, ఇక్కడే కుటుంబ సభ్యులతో కూర్చుంటానని మొండికేశాడు. ప్రధాన కూడలిలో ఆ రైతు పోలీసును బతిమాలుతున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.