గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల పునరావాస కేంద్రంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మీడియా సమావేశం నిర్వహించారు. తెదేపా కార్యాకర్తలపై దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు స్పందించని పోలీసులు.. చంద్రబాబు పల్నాడులో పర్యటిస్తారని చెప్పగానే ఎందుకు అప్రమత్తమయ్యారంటూ నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని అన్నారు. గ్రామంలో ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో నేరాలు చేశామని ఆరోపిస్తున్న వైకాపా ప్రభుత్వం...వాటికి సంబంధించిన సాక్ష్యాలను చూపాలంటూ సవాల్ విసిరారు. అధికారులు ఓ రాజకీయ పార్టీకి సానుకూలంగా ఉండటం సరికాదని అన్నారు.ఇదీ చదవండి : పల్నాడులో ప్రశాంత వాతావరణం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్