Mekathoti Sucharita : రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే ఉంటానని.. లేకపోతే ఇంట్లో ఉంటానని మాజీ హోం మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నిర్వహించిన పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇటీవల వస్తున్న పార్టీ మారుతారనన్న ఊహాగానాలకు మేరకు ఆమె స్పందించారు. తన రాజకీయ ప్రస్థానం సీఎం జగన్‌తోనేనని ఆన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏదో వస్తే అపార్థం చేసుకుని రకరకాలుగా ప్రచారం చేయటం సరికాదన్నారు. భర్త ఎటు ఉంటే భార్య అటు ఉంటుందనడంలో తప్పేముందన్నారు. పార్టీ మారాలనుకుంటే నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తానని.. లేనిపోని అపోహలు ప్రజల్లోకి తీసుకువెళ్లవద్దంటూ కోరారు.
"జగన్మోహన్రెడ్డి వెంట నడిచే వారిలో ప్రథమరాలినని గర్వంగా చెప్పుకుంటున్నాను. రాజకీయ ప్రస్థానం ఉంటే జగన్మోహన్ రెడ్డితోనే. నేను చాలాసార్లు చెప్పాను. రాజకీయంగా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా.. లేకుంటే నా ఇంట్లో ఉంటా. నేను పక్క పార్టీలా వైపు చూసింది లేదు. చూడబోయేది లేదు." -మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే
ఇవీ చదవండి: