కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి వేళ స్వల్ప ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో రాత్రి 2.50 గంటలకు 5 నుంచి 8 సెకన్లపాటు, నందిగామలో 2.40 గంటలకు 10 సెకన్లపాటు భూమి కంపించింది. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బెల్లంకొండ పరిసరాల్లోనూ రాత్రి 2.40 గంటలకు 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏడేళ్ల క్రితం సైతం జనవరి 26న భూ ప్రకంపనలు వచ్చాయి.
ఇదీ చదవండి: