విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి విమానాలు, రైళ్లు, బస్సులు ఇతర మార్గాల ద్వారా జిల్లాలకు చేరుకున్న వారికి... స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్, ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లలో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు ప్రజల్లో పూర్తి అవగాహన కలిగించేందుకు ఐఇసీ కార్యాచరణను పెద్ద ఎత్తున నిర్వహించాలని స్పష్టం చేశారు.
హోం క్వారంటైన్‌కు సంబంధించి కొవిడ్ ఆర్డర్ సంఖ్య 51, 52 లను విధిగా పాటించాలని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి లక్షణాలు ఉన్నా.. లేకున్నా విధిగా 14 రోజులు క్వారంటైన్‌కు పంపాలని స్పష్టం చేశారు. ఎంత మంది క్వారంటైన్లో ఉంటున్నారు... ఎంత మందికి పాజిటివ్ వచ్చింది అని వివరాలను పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. అదే విధంగా హోం క్వారంటైన్ లో ఉన్నవారిని క్షేత్ర స్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య బృందాలు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని బోధన ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు,ఏరియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలను నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు.
ఇదీ చదవండి: