తమది సంక్షేమ ప్రభుత్వం అంటున్న వైకాపా... మరోవైపు పన్నుల పెంచి సామాన్యులపై భారం మోపేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడం దారుణం అని సీపీఎం డివిజన్ కార్యదర్శి పోపూరి సుబ్బారావు అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పన్ను పెంచేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ధర్నా నిర్వహించారు.
కరోనా నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల ఆర్థికంగా చేయూత ఇస్తుంటే రాష్ట్రంలో ప్రజలపై పన్ను భారం మోపడం బాధాకరమన్నారు. ఇతర రాష్ట్రాల వలే అసెంబ్లీలోకేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: