రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. వైకాపాకు చెందిన గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యుడు కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ సోకిన విషయాన్ని రోశయ్య వీడియో ద్వారా స్వయంగా వెల్లడించారు.
ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే తాను వైరస్ బారిన పడినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వెంటనే హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. అందరి అభిమానంతో త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు.